కథ పేరు | : ఆదాము - హవ్వ |
వాక్య భాగము | : ఆదికాండము 2 & 3 |
క్లుప్త వివరణ :
దేవుని సృష్టి - ఆదాము - హవ్వ - పళ్ళు - ఏదెను తోట - పాము
- ఈ వాక్యానములో నేను గ్రహించినది :
- దేవుడు వద్దని చెప్పినది చేయరాదు.
- మన తప్పులను ఒప్పుకోకుండా ఇతరులపై మోపరాదు.
Title | : Adam - Eve |
References | : Genesis 2 & 3 |
Short Story :
God's creation - Adam - Eve - Fruits - garden of Eden - serpent
- What I understand in this sentence is: :
- Do not do what God does not want.
- We should not blame others without admitting our fault.
- ఆదాము - హవ్వ
- దేవుడు ఈ లోకములో ప్రతి దానిని చేశాడు, ఆయన చేసినది చాలా బాగుంది అని అనుకున్నాడు. మరియు దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదెను. అప్పడు నరుడు జీవాత్మ ఆయెను.
- దేవుడైన యెహోవా తూర్పున ఉన్న ఏదెనులో ఒక తోటవేసి, తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను.
- అప్పుడు దేవుడు ఆదాముతో ఇలా అన్నాడు - "నీవు ఫలములను తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; ఒకవేళ తింటే నీవు చనిపోతావు అని కూడా చెప్పేడు."
- ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను.
అప్పుడు దేవుడు నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని, ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతని ప్రక్కటముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.
తరువాత ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించెను, ఆ స్త్రీ పేరు హవ్వ. అలా వారు ఆ తోటలో ఉండేవారు.
- దేవుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను.
ఆ సర్పము హవవతో ఇలా అంది - "ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? మీరు చావనే చావరు"
వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు
దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా, హవ్వా దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;
- వారు దేవుడు వద్దని చెప్పిన పళ్ళు తిన్నారు, కాబట్టి వారి కన్నులు
తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను
చేసికొనిరి. దేవుడు వారి యొద్దకు వచ్చిన్నప్పుడు, ఆయన స్వరమును విని ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనెను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందు కతడునేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.
అందుకాయననీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.
అందుకు ఆదాము - నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతోనీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ - సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు, నీవు బ్రదుకు దినములన్ని మన్ను తిందువు. మరియు 1నీకును 2స్త్రీకిని నీ 3సంతానమునకును ఆమె 4సంతానమునకును వైరము కలుగజేసెదను. వేదనతో పిల్లలను కందువు; ఆయన ఆదాముతో - నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను, తరువాత ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను. అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.


కథ పేరు | : కయీను - హేబెలు |
వాక్య భాగము | : ఆదికాండము 4 |
క్లుప్త వివరణ :
హేబెలు గొఱ్ఱల కాపరి - కయీను భూమిని సేద్యపరచువాడు - యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను; -
కయీను హత్య - తమ్ముడు మరణము -
కయీను శిక్ష.
- ఈ వాక్యానములో నేను గ్రహించినది :
- 1. దేవుడు అర్పణ కంటే ముందు వారి మనస్సు చూస్తాడు.(యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను;[ఆది 4:4])
Title | : Cain - Abel |
References | : Genesis 4 |
Short Story :
Abel was a keeper of sheep - Cain was a tiller of the ground. - the LORD had respect unto Abel and to his offering: -
Cain slew - Death of younger brother
- What I understand in this sentence is: :
- God sees their mind before the offering[the LORD had respect unto Abel and to his offering:].
- కయీను - హేబెలు
- ఆదాము హవ్వలకు ఇద్దరు కుమారులు జన్మించినారు, వారిలో పెద్దవాడు కయీను, చిన్నవాడు హేబెలు. కయీను భూమిని సేద్యపరచువాడు. హేబెలు గొఱ్ఱల కాపరి; దేవునికి అర్పణగా కయీను పొలముపంటలో కొంత తెచ్చెను. హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను; కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. అయితే కయీను కోపము వచ్చి తన ముఖము చిన్నబుచ్చుకొనెను. తరువాత వారు పొలములో ఉన్నప్పుడు కయీను హేబెలును చంపెను. ---