అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే (2)అద్భుత శక్తిని నెరపుటకైనా - ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)ఆ యేసు రక్తానికి - సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2)           ||అన్నీ సాధ్యమే||

1.మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2)మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2)         ||అన్నీ సాధ్యమే||

2.ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2)బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని
మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2)           ||అన్నీ సాధ్యమే||

3.ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2)యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును
ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2)           ||అన్నీ సాధ్యమే||

4.కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2)కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2)           ||అన్నీ సాధ్యమే||

5.మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను
బండనే చీల్చగా – జలములే పొంగెను
ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము
కష్టాల కడలిలో – కన్నీటి లోయలో