నీకొలాస్ 14 - మే - 1997లో యూ.కే. లండన్ లో ఉన్న Dollwich అనే పల్లెటూరులో జన్మించాడు. నీకొలాస్ కు తన తల్లి అంటే చాల ఇష్టం కాని తండ్రి అంటే కొంచెం భయం ఉంది. నీకొలాస్ చెసే చిన్న చిన్న తప్పులను తండ్రి తనని మందలించెవాడు, ఈ కారణముగనే తన తండ్రి అంటే కొంచెం భయం ఏర్పడింది.
నీతి : ఆయనను నిర్లస్య పెట్టకు
వాక్యము :- యోహాను 1:1
నీకొలాస్ 2వ యేట తన తల్లి అందరు నమ్ముకుంటున్నారు కధ అని తాను కూడా యేసును తన డేవునిగా అంగీకరించింది. తెలిసో తేలికో ఆమె ఒక మంచి పని చేసింది. నీకొలాస్ చిన్నతనం నుండి స్కూల్ లో చాలా బాగా చదివేవాడు, తరువాత పై చదువుల కోసం తన ఊరు నుండి 4కి.మీ. దూరంలో ఉన్న Balham ఊరిలో చదువుకోడానికి దేవుడు మార్గము చూపించెను.
నీకొలాస్ చిన్నప్పటి నుండి యేసుని నమ్ముకొనెను కాని దేవుడు ఉన్నాడు అని నీకొలాస్ కు తెలిదు, ఎదో తన వాల్లు దేవుని నమ్ముకున్నారు అని మాత్రమే నమ్ముకునాడు. యేసుమీద నమ్మకం లేదు. అలాగా దేవుని తనని చూడంలేదు అని అనుకునేవాడు, అలాగ చదువులో చెడు వ్యసనాలకు బానిసయ్యెను.ఒకసారి నీకొలాస్ తనకు తెలికుండానే మోకాళ్లు వేసి ప్రార్ధన చేసాడు, ఆ గుంపులో దాదాపు 35 - 40 మంది ఉంటారు, ప్రార్ధన చేస్తుండగా పరిశుద్దాత్మా పూనుడై అందరిలో ఒక చిన్న పిల్లవాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. నీకొలాస్ కి ఎప్పుడు అలాగ ప్రార్ధానలో ఏడవడం జరగలేడు అదే మొదటిసారి, ఆ అనుభవము తరువాత తన అడుగులు దేవునివైపు పరుగులు తీశాయి.తన పాపాలు ఒక్కొక్కటిగా దేవుని వద్ద ఒప్పుకోవడం మొదలుపెట్టాడు, ఈ కార్యం తనకి తెలియకుండానే జరిగింది.అలా దేవునిలో ఎదుగుతు దేవుని పాటలు ఆత్మతో పాడటం మొదలుపెట్టాడు. రెండు సంవత్సరాలు గడిచిన తరువాత Balham చర్చిలో ఆరాధన నడిపే గుంపులో ఎంపిక అయ్యేడు. త్వరలోనే ఆరాధన నడిపే బాధ్యత స్వీకరించెను. అక్కడ నుండి తను దేవునికి మరింతా దగ్గరగా అయెను.కాని 2 - జులై- 2017 లో జరిగిన సంఘటన తన జీవితాన్నే మార్చేసింది. ఆ రోజు ఆదివారం సంఘంలో ఒక పార్టీ ఏర్పాటు చెసారు, ఒక అరగంట వాక్యం అనంతరం పార్టీని మొదలుపెడదం అని నిర్ణయించారు. నీకొలాస్ తను స్నానం చెస్తున్నప్పుడు ఒక అలోచన వచింది. ఈరోజు ఒక అరగంట మాత్రమే ప్రార్ధన ఉంది కాబట్టి మనం బైబుల్ తీసుకుపోనవ్సరంలేదు అని, రెడీ అవుతున్నప్పుడు. మరల అలోచన వచింది పరవలేదు అయిన అరగంట వాక్యం అయ్యేక బైబుల్ పార్టీలో ఎక్కడ ఉంచుతాం అని, మరల తన స్నేహితులు తను పెద్ద భక్తుడు అని హేళన చేస్తారని అలోచించి బైబులుని విడచి వెళ్లిపోయాడు. ఆరాధన సమయం వచ్చింది, ఆరాధన జరుగుతుండగా ఎవరో తన ప్రక్కన ఏడుస్తునట్లు గ్రహించాడు. ఎవరా అని కల్లు తెరచి చూసాడు ప్రక్కన ఎవరు లేరు, సరే అని మరల ఆరాధన జరిగించాడు మరల అదే స్వరం వినిపించింది ఈ సారి చుట్టు ఉన్న అందరిని చూడసాగాడు. అందరు మాములుగానే ఉన్నారు. ఆ ఏడుపు దేవుడు స్వరం అని గ్రహించాడు. ఈసారి నీకొలాస్ ఏడవడం మొదలుపెట్టాడు తను ఎందుకు ఏడుస్తున్నాడో తనకే తెలిదు మరి. అక్కడ ఉన్నవారంత ప్రార్ధనలో ఏకాము అయ్యెరు. ఆరాధన ముగిసేక సంఘకాపరి - నీకొలాస్ ఈరోజు ఆరాధన చక్కగా నడిపించావు అని మెచ్చుకునాడు. అప్పుడు నీకొలాస్ - అయ్య నేను ఆరాధనలో ఒక స్వరం విన్నాను, పరిశుద్దత్మా దేవుడు ఏడుస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆయన ఒక క్షణం అలోచించి ఈరోజు నీ గదిలోకి వెళ్లి ప్రార్ధన చెయ్యి, దేవా నేను ఏమైనా తప్పిదం చెస్తే నన్ను క్షమించు, నీ చిత్తము ఎమిటో నాకు తెలియాజేయు అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ రాత్రి నీకొలాస్ ప్రార్ధనలో మళ్లి ఆ స్వరం విన్నాడు తన ప్రక్కన మరల ఎవరో ఏడుస్తునారు ఈసారి నీకొలాస్ కి మరల ఏడుపు వచింది.అలా తన సంఘకాపరి చెప్పినట్లు ప్రార్ధన చేయాసాగెను అప్పుడు ఆ స్వరం ఇలాగ చెప్పెను - నీకొలాస్ నన్ను ఎందుకు విడిచిపెట్టెసావు అని, అయ్యో దేవ నేను ఎప్పుడూ నిన్ను విడవను, అని మరల ఎక్కువ ఏడ్వడం మొదలుపెట్టాడు. అయినా నేను ఎప్పుడూ దేవుని విడచిపెట్టాను అని అనుకున్నాడు. ఈ సందేహం నీకొలాస్ కి వచ్చిన వెంటనే ఆ స్వరం ఇలా అన్నాడు - నీవు ఇంటి నుండి ప్రార్ధనకు వెళ్ళేటప్పుడు రెండు మార్లు నన్ను తీసుకొని వెళ్లు అని నీతో మాట్లాడలేదా అని చెప్పాసాగేను. తనకి ఇంక అర్దం కాలేదు అప్పుడు ఆ స్వరం - యోహాను సువార్త 1 : 1 చదువు అని చెప్పి ఆ స్వరం ఇంకా వినిపించాలేదు. అప్పుడు నీకొలాస్ కు దేవుడు వాక్యామైయున్నాడు కద అని గ్రహించి మరల ఎక్కువ ఏడవడం మొదలుపెట్టాడు. Balham లో ఉన్న తన సంఘంలో తన సాక్ష్యమును పంచుకున్నాడు . ఆ రోజు నుండి తన బైబుల్ ని ఎన్నాడు విడచిపెట్టాలేదు ఎందుకంటే వాక్యామై దేవుడు అని నీకొలాస్ తెలుసుకున్నాడు అలాగే తనను ప్రతి క్షణం దేవుడు గమనిస్తున్నాడు అని కూడా గ్రహించెను.
నీతి : ఆయనను నిర్లస్య పెట్టకు
వాక్యము :- యోహాను 1:1